'కొత్త గ్యాలరీని నిర్మిస్తున్నా.. మరింత మెరుస్తా': షారూఖ్ ఖాన్
రిపోర్టర్: హరి
స్థలం: ముంబై
ముంబైలోని బాంద్రాలో ఉన్న తన ప్రసిద్ధ నివాసం మన్నత్ భవనంలో భారీ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నట్లు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ వెల్లడించారు. సోషల్ మీడియాలో నిర్వహించిన ఆస్క్ ఎస్ఆర్కే సెషన్లో అభిమానులతో సరదాగా ముచ్చటించిన ఆయన, భవనంలో కొత్తగా గ్యాలరీని నిర్మిస్తున్నానని, అక్కడి నుంచే అభిమానులను పలకరిస్తానని చమత్కరించారు. భవనంలో జరుగుతున్న ఈ విస్తరణ పనుల్లో భాగంగానే అదనపు అంతస్తుల నిర్మాణం కూడా జరుగుతోందని సమాచారం.