మట్టి ప్రతిమలతో పర్యావరణ పరిరక్షణ
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామ సర్పంచ్ పూలనగారి నాగేశ్వరి అశ్విన్‌కుమార్ మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించాలని కోరారు. మట్టి ప్రతిమలు పర్యావరణహితమైనవని, నీటి కాలుష్యాన్ని నివారించేందుకు దోహదపడతాయని తెలిపారు. భక్తితో వినాయకుడిని పూజిద్దాం.. బాధ్యతతో ప్రకృతిని కాపాడుదాం అని పిలుపునిచ్చారు.