అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటామన్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్

రిపోర్టర్: శివ స్థలం: అమెరికా

అమెరికా పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అగ్రరాజ్యంతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య పలు అంశాలపై ఉమ్మడి అవగాహన కుదిరిందని, ప్రజల మధ్య స్నేహం గొప్ప భవిష్యత్తుకు బాటలు వేస్తుందని జిన్పింగ్ స్పష్టం చేశారు.