రాష్ట్రంలో అక్టోబర్ నవంబర్ నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

రిపోర్టర్: రాము స్థలం: తూర్పుగోదావరి

రాష్ట్రంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. నవంబర్ లోపు ఎన్నికలు పూర్తి కాకపోతే కేంద్రం నుంచి రావాల్సిన పదహారో ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో సుమారు ఇరవై ఎనిమిది కోట్ల వ్యయంతో చేపట్టనున్న రహదారుల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.