మేఘాలయ రాజకీయాల్ లో సంచలనం: కేబినెట్ మంత్రి పదవికి యుడీపీ అధ్యక్షుడు మెత్బా రాజీనామా
రిపోర్టర్: అశోక్
స్థలం: Meghalaya
మేఘాలయలో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీల్లోకి ఫిరాయించడంతో, ఆ పార్టీ అధ్యక్షుడు మెత్బాంగ్డో శనివారం తన కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మారుతున్న రాజకీయ పరిణామాల కారణంగానే తను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కాన్రాడ్ సంగ్మాకు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు మెత్బాంగ్డో స్పష్టం చేశారు. పార్టీ ఒంటరిగా మిగిలిన తరుణ మంత్రిగా కొనసాగలేనని ఆయన తేల్చిచెప్పారు.