కేటీఆర్, హరీశ్ రావులను అరెస్ట్ చేసిన పోలీసులు

రిపోర్టర్: నరేష్ స్థలం: సిద్ధిపేట

తెలంగాణలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ ముట్టడికి కాంగ్రెస్ యత్నించగా, దాన్ని అడ్డుకునేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావులను బొల్లారం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. మా ఇంటికి వెళ్తుంటే మమ్మల్ని అడ్డుకోవడం ఏంటని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు హాని జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.