విద్యార్థులకు అలర్ట్: సీబీఎస్ఈ సైన్స్ ఛాలెంజ్ 2026-27 ప్రకటన విడుదల

రిపోర్టర్: అశోక్ స్థలం: New Delhi

విద్యార్థులలో శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందించే లక్ష్యంతో సీబీఎస్ఈ సైన్స్ ఛాలెంజ్ 2026-27 పోటీలను నిర్వహిస్తున్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఎనిమిది, తొమ్మిది మరియు పదవ తరగతుల విద్యార్థుల కోసం రెండు దశలలో ఈ పోటీలు జరుగనున్నాయి. మొదటి దశ పాఠశాల స్థాయి పోటీలు నవంబర్ రెండు నుంచి పదమూడు వరకు నిర్వహించబడతాయని, అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.