కపటి గ్రామంలో పోలీసుల పల్లె నిద్ర: నేరాలపై ప్రజలకు అవగాహన
రిపోర్టర్: KISHORE M
స్థలం: ఆదోని
కపటి గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. తాలూకా సీఐ నల్లప్ప, ఇస్వి ఎస్ఐ మహేష్ పాల్గొని రోడ్డు ప్రమాదాలు, ఎన్నికల నిబంధనలు, సైబర్ నేరాలు మరియు మహిళల భద్రతపై గ్రామ ప్రజలకు పలు కీలక సూచనలు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.