నాతవరంలో ఘనంగా అంకంరెడ్డి జమీల్ నాలుగో వర్ధంతి
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నాథవరం
అనకాపల్లి జిల్లా నాతవరంలో దివంగత నేత అంకంరెడ్డి జమీల్ నాలుగో వర్ధంతిని అభిమానులు, ప్రజలు ఘనంగా నిర్వహించారు. మాచవరం వీధిలో ఆయన చిత్రపటంతో భారీ ఊరేగింపు నిర్వహించి, జమీల్ సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం స్మశానవాటికలో నీటి సౌకర్యం కోసం బోరు, స్నానపు గదులు నిర్మించారు. అలాగే గొల్లపేటలో ఆలయానికి బోరు వేయించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పీటీసీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.