బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో దోశలు వేసిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: కర్ణాటక
బెంగళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌ను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆకస్మికంగా సందర్శించారు. కిచెన్‌లోకి వెళ్లి వంట సిబ్బందితో కలిసి స్వయంగా దోశలు వేయడంతో పాటు ఫిల్టర్ కాఫీ తయారు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి.