ఓసీఐ రద్దుపై ఇమ్రాన్ ఖాన్ పోరాటం: బాంబే హైకోర్టులో ఊరట

రిపోర్టర్: హరి స్థలం: Mumbai

దేశం విడిచి వెళ్లాలంటూ ఎఫ్ఆర్ఆర్వో జారీ చేసిన నోటీసును సవాల్ చేస్తూ నటుడు ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారని, దీనిపై స్పందించిన న్యాయస్థానం నవంబర్ రెండవ తేదీ వరకు తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించారు. తనపై తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన ఆధారాలు, పోలీసు నివేదికలను తనకు అందజేయాలని, తనకు తగిన వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.