'ఆశీర్వాద దీపం' వెలిగిస్తాం: బీజేపీ ఆంధ్రప్రదేశ్ పిలుపు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Andhra Pradesh

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు 'ఆశీర్వాద దీపం' వెలిగించనున్నట్లు BJP Andhra Pradesh ప్రకటించింది. మోదీ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కోరుతూ ప్రజలంతా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజల జీవితాలను తీర్చిదిద్దిన మహనీయుడికి కృతజ్ఞతాపూర్వకంగా దీపాలు వెలిగించాలని స్పష్టం చేశారు.