మృత్యువులా వేలాడుతున్న విద్యుత్ తీగలపై కదం తొక్కిన నాయకులు
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం నగరంలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలు, తీగలు, డివీలను వెంటనే తొలగించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. చిన్న గాలికే తీగలు తగిలి నిప్పురవ్వలు వస్తున్నాయని, వాహనాలపై పడే ప్రమాదం ఉందన్నారు. పాఠశాలలు, పిల్లలు ఆడుకునే ప్రాంతాల్లో వేలాడుతున్న తీగలను సరిచేయాలని కోరారు. అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని మహమ్మద్ సలాం, యానాల సాంబశివరెడ్డి డిమాండ్ చేశారు.