పాలమూరు ఎత్తిపోతల డీపీఆర్ వెనక్కి: చంద్రబాబు కుట్రలపై సింగిరెడ్డి నిప్పులు
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
పాలమూరుకు బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు మరణశాసనం రాస్తున్నాయని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపడం వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కులను తాకట్టు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలందరూ నిలదీయాలని, డీపీఆర్ ఆమోదించకపోతే త్వరలోనే పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు.