వాయిపేట్ జగదాంబ ఆలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక పూజలు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

సిరికొండ మండలంలోని వాయిపేట్ గ్రామ జగదాంబ ఆలయంలో శుక్రవారం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పండుగలు ప్రజల్లో ఆధ్యాత్మిక భావనతో పాటు ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.