అరేబియా సముద్రంలో పైరేట్ల చెర నుంచి ఇరాన్ బోటు రక్షణ
రిపోర్టర్: మహేష్
స్థలం: ముంబై
అరేబియా సముద్రంలో సొమాలియా సముద్రపు దొంగల చెర నుంచి ఇరాన్ కు చెందిన అజినీ ఫిషింగ్ బోటును, అందులోని 20 మంది సిబ్బందిని భారత నౌకాదళం విజయవంతంగా రక్షించిందని అధికారులు తెలిపారు. ముంబై తీరానికి 3 వేల కిలోమీటర్ల దూరంలో 48 గంటల పాటు సాగిన ఈ డేరింగ్ ఆపరేషన్ లో మెరైన్ కమాండోలు పాల్గొని పైరేట్లను లొంగదీసుకున్నారు. ఈ సాహసోపేత చర్యను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు.