దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలమన్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

రిపోర్టర్: రాము స్థలం: హర్యానా

దేశ అభివృద్ధికి, ఉద్యోగాల సృష్టికి సరికొత్త ఆలోచనలు ఎంతగానో దోహదపడతాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి స్పష్టం చేశారు. హర్యానాలోని ఒక విశ్వవిద్యాలయ వేడుకలో ఆయన మాట్లాడుతూ, యువత తమ వృత్తి జీవితంలో కష్టపడేతత్త్వం, నిజాయితీ, నైతిక విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. సమాజంలో గౌరవం సంపాదించడమే నిజమైన విజయమని ఆయన పేర్కొన్నారు.