కేతన్ అగర్వాల్ హత్య కేసు: ప్రాసిక్యూటర్ గా నిఖిల్ రంగప్రవేశం
రిపోర్టర్: శివ
స్థలం: Pune
పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణ ప్రారంభమైందని ప్రముఖ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్జ్వల్ నిఖిల్ తెలిపారు. లోహగడ్ కోటపై నుంచి కాబోయే భార్య, ఆమె ప్రియుడు కుట్రపన్ని కేతన్ ను తోసేసి హత్య చేశారని ప్రాసిక్యూషన్ వెల్లడించింది. వడ్గావ్ మావల్ సెషన్స్ కోర్టులో శనివారం ప్రారంభమైన ఈ కేసులో నిందితుల తరపున బెయిల్ దరఖాస్తులు దాఖలయ్యాయని, నవంబర్ 17న ప్రాసిక్యూషన్ వాదనలు వినిపిస్తామని నిఖిల్ పేర్కొన్నారు.