తీవ్ర అలర్ట్: ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

రాష్ట్రంలో రాబోయే మూడు గంటల్లో పలు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్తో పాటు గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, చెట్లు లేదా ఎత్తైన విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని అధికారులు గట్టిగా సూచించారు.