విజయనగరంలో పైడితల్లి సిరిమానోత్సవ వైభవానికి సర్వం సిద్ధమైన వేళ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం రూరల్
విజయనగరంలో ప్రసిద్ధ పైడిమాంబ సిరిమానోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం కలెక్టర్ రామసుందరరెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. హుకుంపేట నుంచి సిరిమాను చదురుగుడికి చేరుకుంటుంది. పూజారి వెంకటరావు సిరిమానును అధిష్ఠించి కోట వరకు ప్రదక్షిణలు చేస్తారు. సాయంత్రం లోపు ఉత్సవం ముగియనుంది.