పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక: అణు బెదిరింపులకు భారత్ ఎన్నటికీ తలవంచదంటూ స్పష్టీకరణ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Geneva
అణు బెదిరింపులకు భారత్ ఎన్నటికీ తలవంచబోదని, ఏ క్షణంలోనైనా ఉగ్రవాద దాడులకు తగిన విధంగా దీటైన బదులిస్తామని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత సీనియర్ సలహాదారు అన్మోల్ షేర్ సింగ్ బేడీ స్పష్టం చేశారు. జెనీవాలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదానికి మద్దతిచ్చే వారిని, సూత్రధారులను ఒకేలా చూస్తామని తేల్చిచెప్పారు. అణ్వాయుధాలను రాజకీయ ఒత్తిడికి ఆయుధాలుగా వాడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.