ప్రేమ, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి మమిత బైజు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
ఎవరినైనా చూసిన వెంటనే ఇష్టపడటం లేదా ప్రేమలో పడటం తనకు చాలా అరుదుగా జరుగుతుందని మలయాళ యువ నటి మమిత బైజు వెల్లడించారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, వ్యక్తిత్వాలను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ఇష్టపడతానని స్పష్టం చేశారు. ప్రేమ వివాహాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ, తన వ్యక్తిగత జీవితంలోకి ఎవరినీ అంత సులభంగా రానివ్వనని, భవిష్యత్తులో మంచి సంబంధంలో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆమె వివరించారు.