మహిళలతో దేహశుద్ధి చేయిస్తానంటూ ప్రత్యర్థులకు కొండా సురేఖ హెచ్చరిక
రిపోర్టర్: రాజేష్
స్థలం: వరంగల్
నోరు అదుపులో పెట్టుకోకపోతే మహిళలతో దేహశుద్ధి చేయిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ ప్రత్యర్థి నేతలను హెచ్చరించారు. వరంగల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉండాలని, హద్దులు దాటితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఒక్కో మహిళ నలుగురిని ఎదుర్కొనే సత్తా ఉందని, ఇష్టానుసారం మాట్లాడితే చిత్తుచిత్తుగా కొట్టిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.