వరంగల్ జిల్లాలో విషాదం: అనారోగ్యంతో యూత్ కాంగ్రెస్ నాయకుడు మృతి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పర్వతగిరి
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి చెందిన సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకుడు పుల్లూరి దిలీప్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. గతంలో ఆయన వర్ధన్నపేట నియోజకవర్గ కన్వీనర్‌గా సేవలందించారు. దిలీప్ మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.