ఆసియా క్రీడలకు సన్నద్ధమవుతున్న భారత గోల్ఫ్ క్రీడాకారుడు యువరాజ్ సంధు
రిపోర్టర్: సురేష్
స్థలం: న్యూఢిల్లీ
యూరోపియన్ టూర్ అనుభవంతో ఆసియా క్రీడలకు సిద్ధమవుతున్న భారత గోల్ఫ్ క్రీడాకారుడు యువరాజ్ సంధు జపాన్ లో పతకం సాధించడంపై ధీమా వ్యక్తం చేశారు. చండీగఢ్ లో కుటుంబంతో కొద్దిరోజులు గడిపిన అనంతరం కోచ్ గుర్భాజ్ మాన్ పర్యవేక్షణలో ఆయన సాధన చేస్తున్నారు. జపాన్ లోని కాసుగాయ్ కంట్రీ క్లబ్ వేదికగా సెప్టెంబర్ 30 నుంచి ఆసియా క్రీడల గోల్ఫ్ పోటీలు ప్రారంభంకానున్నాయి.