తెలుగు జాతి కీర్తిని చాటిన మహోన్నత ఇంజినీర్ విశ్వేశ్వరయ్య
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
భారతదేశం గర్వించదగ్గ మహా ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని పలువురు ఘన నివాళులు అర్పించారు. ఇంజినీరింగ్ రంగంలో తన అసాధారణ ప్రతిభతో చిరస్థాయిగా నిలిచిన ఆ మహనీయుడిని దేశం అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో సత్కరించుకుంది. హైదరాబాద్ నగరానికి వరదల ముప్పు తప్పుటకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని, నగర ప్రణాళికకు ఆయన అడుగుజాడలే పునాది అని ప్రముఖులు కొనియాడారు.