అర్నబ్ తుపాను నష్టంపై సమీక్ష: కేంద్ర బృందాన్ని కోరిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన అర్నబ్ తుపాను కారణంగా రూ.4,600 కోట్ల మేర నష్టం వాటిల్లిందని, బాధితులను ఆదుకోవడంతో పాటు పునరుద్ధరణ పనులకు కేంద్రం నుంచి తక్షణమే నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో కోరారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్ లో క్షేత్రస్థాయి పరిశీలన ముగించిన కేంద్ర ప్రతినిధి బృందం సోమవారం సచివాలయాలలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎంను ప్రత్యేకంగా కలిసి చర్చించింది.