'తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు': బండి సంజయ్ కుమార్

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

నిజాం రజాకర్ల పైశాచిక కృత్యాలకు చరమగీతం పాడిన చారిత్రాత్మక దినం సెప్టెంబర్ 17 అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్పం, భారత సైన్యం సాహసం, ఎందరో అమరుల పోరాటాల ఫలితంగానే తెలంగాణ విమోచన సాధ్యమైందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ఆయన ఘనంగా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.