గాజియాబాద్‌లో తండ్రిపై పిస్టల్‌తో కుమార్తె బెదిరింపులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: ఉత్తర ప్రదేశ్
ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో గృహ వివాదం కారణంగా ఒక కుమార్తె తన తండ్రి మరియు వదినపై పిస్టల్ గురిపెట్టి బెదిరించింది. కారు లోన్ వెరిఫికేషన్ విషయంలో తండ్రి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన ప్రియాంక తోమర్ అనే మహిళ తన స్నేహితుడితో కలిసి వచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కాగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.