ఖమ్మంలో మృతి చెందిన గరుడ పక్షికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం బైపాస్ రోడ్డులో విద్యుత్ వైర్లు తగిలి గరుడ పక్షి మృతి చెందింది. సమాచారం అందుకున్న అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు వెంటనే స్పందించి, పక్షి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పూలతో అలంకరించి, పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. చెట్టు కింద గుంట తవ్వించి గౌరవప్రదంగా ఖననం చేశారు. మూగజీవాల పట్ల ఆయన చూపిన మానవతా దృక్పథాన్ని స్థానికులు అభినందించారు.