అనవసర శస్త్రచికిత్సలపై వైద్య నిపుణుల సంచలన విషయాలు వెల్లడి

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

ఆధునిక వైద్య రంగంలో ప్రతి సమస్యకు శస్త్రచికిత్స ఒక్కటే పరిష్కారం కాదని, కొన్ని సందర్భాల్లో కోత కోయకుండా వేచి చూడటమే మెరుగైన ఫలితాలనిస్తుందని వైద్య నిపుణులు వెల్లడించారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో జరుగుతున్న అధ్యయనాల ప్రకారం చాలా రకాల ఆర్థోపెడిక్ ఆపరేషన్లు కేవలం మందులు, ఫిజియోథెరపీతోనే నయమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. అత్యవసరం కాని సర్జరీల వల్ల రోగులకు అదనపు భారం పడుతుందని, వ్యాధి స్వభావాన్ని బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేశారు.