గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం భక్తులపై దూసుకెళ్లిన కారు
రిపోర్టర్: సునీల్
స్థలం: గుజరాత్
గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్‌లో అంబికామాత యాత్ర మార్గంలో వేగంగా వచ్చిన కారు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. ఆగ్రహించిన స్థానికులు, భక్తులు కారును ధ్వంసం చేసి నిప్పుపెట్టడంతో పాటు పరారీకి యత్నించిన డ్రైవర్‌పై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.