నాగావళి ఉగ్రరూపంతో శ్రీకాకుళం జిల్లాలో జలమయమైన గ్రామాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నది ఉగ్రరూపం దాల్చడంతో వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిందని, పలు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల వర్షాలతో ప్రధాన రహదారులు జలమయమై రాకపోకలు స్తంభించాయని, వేలాది ఎకరాల వరి పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడులు కూడా దక్కవని కన్నీరుమున్నీరవుతున్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నదాతలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు.