బోర్వెల్ అనుమతులకు ప్రత్యేక దరఖాస్తుల స్వీకరణ.. కలెక్టర్ కీలక ప్రకటన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం రూరల్

ఖమ్మం జిల్లాలో ఆర్వోఎస్ఆర్ పట్టా భూముల యజమానులు బోర్వెల్ తవ్వుకునేందుకు ఇకపై సులభంగా అనుమతులు పొందవచ్చు. దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా, దరఖాస్తు చేసుకున్న రోజే పరిశీలించి అనుమతులు మంజూరు చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర టీ.ఎస్ ప్రకటించారు.

ఈ నెల 10న జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో బోర్వెల్ అనుమతుల కోసం ప్రత్యేకంగా దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన రైతులు, భూ యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ నిర్ణయంతో రైతులకు ఎంతో ఊరట లభించనుంది.