అన్నవరం రైల్వే స్టేషన్‌లో గూడ్స్ బండిపైకి ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అన్నవరం

అన్నవరం రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి కలకలం సృష్టించాడు. రెండు బోగీల మధ్య ప్రయాణించి స్టేషన్‌కు చేరుకున్న వెంటనే గూడ్స్ రైలు పైకప్పు మీదికి ఎక్కి, అనంతరం స్టేషన్ షెడ్డు పైకి చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. అప్రమత్తమైన జిఆర్పి, ఆర్పీఎఫ్ సిబ్బంది సుదీర్ఘంగా శ్రమించి అతడిని కిందకు దించారు. విచారణలో తన పేరు దీనబంధు అని, అస్సాం రాష్ట్రానికి చెందినవాడినని తెలిపినప్పటికీ, అతడి వింత ప్రవర్తనపై రైల్వే సిబ్బందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.