రుషికేశ్‌లో గంగానదిలో స్నానం చేసిన జపాన్ రాయబారి
రిపోర్టర్: అశోక్
స్థలం: उत्तराखंड
భారత్‌లో జపాన్ రాయబారి ఒనో కీచి రుషికేశ్‌ను సందర్శించి గంగానదిలో మూడుసార్లు పవిత్ర స్నానం ఆచరించారు. జన్మాష్టమి వారాంతంలో ఈ ఆధ్యాత్మిక అనుభూతిని పొందినట్లు ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. గంగా హారతిలో పాల్గొని, నదిలో దిగిన వీడియోలు, సెల్ఫీలను షేర్ చేయగా, నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది.