యువతరం ప్రేమకథా చిత్రం సంగీత్ నుంచి నీవల్లే పాట విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
నిఖిల్ విజయేంద్రసింహా, తేజు అశ్విని జంటగా సాద్‌ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యువతరం ప్రేమకథా చిత్రం సంగీత్. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి నీవల్లే అంటూ సాగే రొమాంటిక్ మెలొడీ తొలి పాటను మేకర్స్ విడుదల చేశారు. విక్రమ్ శివ సాహిత్యం అందించిన ఈ పాటకు అచు రాజామణి సంగీతం అందించగా, సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు. లహరి ఫిల్మ్స్ అండ్ ఆర్‌బీ స్టూడియోస్ బ్యానర్‌పై నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.