జేఎన్టీయూ గురజాడ పరీక్షల అక్రమాలు: విచారణ కమిటీ నివేదిక సమర్పణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
జేఎన్టీయూ గురజాడ పరీక్షల విభాగంలో జరిగిన మార్కుల అక్రమాలపై విచారణ కమిటీ తన నివేదికను రిజిస్ట్రార్‌కు సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం. అదనపు మార్కులకు ప్రత్యేక కోడ్లు కేటాయించి పెద్దఎత్తున మార్పులు చేసినట్లు కమిటీ గుర్తించింది. ఈ నివేదికను పరిశీలించి తదుపరి తగిన చర్యలు చేపడతామని వీసీ సుబ్బారావు వెల్లడించారు. గత నెలలో ఈ అవకతవకలపై కథనాలు వెలువడడంతో వర్సిటీ అధికారులు నలుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించిన విషయం తెలిసిందే.