బీహార్‌లో వరద బాధితులకు సహాయం చేస్తుంటే పండ్లను ఎత్తుకెళ్లిన జనం

రిపోర్టర్: రమేష్ స్థలం: బీహార్

బీహార్‌లో వరద బాధితులను ఆదుకునేందుకు హర్యానా నుంచి వెళ్లిన స్వచ్ఛంద సేవా సంస్థ హర్ మైదాన్ ఫతే సొసైటీ సభ్యులపై చేదు అనుభవం ఎదురైంది. వరద ప్రభావిత ప్రాంతంలో పండ్ల పంపిణీ చేస్తుండగా స్థానికులు ఒక్కసారిగా ఎగబడి బాక్సులను లాక్కుంటూ అపసవ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై సొసైటీ అధ్యక్షుడు సహజ్ దుగ్గల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేయగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి.