అనంతపురంలో కలకలం: బాలికపై దాడి నిందితుడిపై పోలీసుల కాల్పులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో బాలికపై రంపంతో దాడి చేసి పరారైన నిందితుడు హేమంత్ ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై అతడు ఎదురుదాడికి దిగాడని పోలీసులు తెలిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్ లో నిందితుడి కాళ్లలో బుల్లెట్లు దిగాయని, అతడిని చికిత్స నిమిత్తం సర్వజన ఆసుపత్రికి తరలించామని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.