కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది: కరీంనగర్లో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కరీంనగర్
కరీంనగర్ యువ సమరభేరిలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొండా సురేఖతో పాటు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. నిరుద్యోగులకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీని రాహుల్ గాంధీ విస్మరించారని, జాబ్ క్యాలెండర్ చిత్తు కాగితంగా మారిందని మండిపడ్డారు. ధరణి పేరుతో పేదలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్‌ను ప్రజలే రాజకీయంగా నిషేధిస్తారని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.