యలహంక ప్యాలెస్ వివాదంపై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్
రిపోర్టర్: రాజేష్
స్థలం: బెంగళూరు
బెంగళూరులోని యలహంక ప్యాలెస్లో తన కుమార్తె వివాహం జరపాలని భావించినప్పటికీ ఆస్తి వివాదాల నేపథ్యంలో వేదికను మారుస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా వెల్లడించారు. నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం తనది కాదని, యలహంక ఆస్తి వంద శాతం తన పిల్లల భాగానికి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. వివాదాలకు తావివ్వకుండా వివాహ వేడుకను వేరే ప్రదేశంలో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.