మూసీ ప్రాజెక్టుకు ఎన్జీటీ నోటీసులు, అక్టోబర్ 16కు విచారణ వాయిదా

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రాజెక్ట్ పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ రిటైర్డ్ ఇంజినీర్లు చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పర్యావరణ నిబంధనల్లో లోపాలు ఉన్నాయని పిటిషనర్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను అక్టోబర్ 16కు ట్రిబ్యునల్ వాయిదా వేసింది.