కాకినాడ రాజకీయాల్లో సంచలనం: జనసేనలోకి వైఎస్సార్సీపీ కీలక నేతల వలసలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Kakinada

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి తారాస్థాయికి చేరిన వేళ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నట్లు జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రభావం ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ కండువా కప్పుకుని అధికారికంగా చేరారు.