ప్రజలకు అందుబాటులోకి హైడ్రా అధికారిక వెబ్ సైట్

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

శేరిలింగంపల్లి పరిధిలో హైడ్రా కార్యకలాపాలు మరియు పౌర సేవలను ఒకే చోట అందించే అధికారిక వెబ్ సైట్ ను కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్ పదిహేడు సున్నా, ఫైర్ ఎన్ వో సీ సేవలు పొందవచ్చు. చెరువుల ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లు, వాటర్ లాగింగ్ పాయింట్లు, లైవ్ వర్షపాతం వివరాలతో పాటు భూభారతి ద్వారా భూ రికార్డులను నేరుగా పరిశీలించుకునే వెసులుబాటు కల్పించారు.