'త్రిష స్థానంలో ఉంటే విజయ్‌కి దూరంగా ఉండేదాన్ని': నటి అంబిక సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: రమేష్
స్థలం: చెన్నై
తమిళ సినీ పరిశ్రమలో నటుడు విజయ్ మరియు నటి త్రిషల బంధంపై వస్తున్న ఊహాగానాలపై సీనియర్ నటి అంబిక తాజాగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఒకవేళ తాను గనుక త్రిష స్థానంలో ఉండి ఉంటే విజయ్‌కి వీలైనంత దూరంగా ఉండటానికే ప్రాధాన్యత ఇచ్చేదాన్నని తెలిపారు. సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి ప్రతిష్టకు భంగం కలగకూడదని, మన ప్రవర్తన వల్ల ఎదుటివారికి ఇబ్బందులు వస్తున్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆమె పేర్కొన్నారు.