గుంటూరులో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: గుంటూరు తూర్పు

గుంటూరు సాయిబాబా కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలిక సాయి పల్లవి కిడ్నాప్ కేసును లాలాపేట పోలీసులు ఛేదించారు. బాపట్ల రైల్వే స్టేషన్లో బాలికను సురక్షితంగా రక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కిడ్నాప్కు పాల్పడిన బాలిక మేనమామ మనోజ్ కుమార్తో పాటు అతడికి సహకరించిన భార్య షేక్ సుమయ్యను అరెస్ట్ చేసినట్లు గుంటూరు ఈస్ట్ డీఎస్పీ టి. సీతారాం వెల్లడించారు.