పశ్చిమ గోదావరిలో విషాదం: అప్పుల బాధతో నదిలోకి దూకిన కుటుంబం

రిపోర్టర్: వెంకట్ స్థలం: పశ్చిమ గోదావరి

పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ బ్రిడ్జి వద్ద అప్పుల బాధ తాళలేక నంబూరు శ్రీనివాస్ కుటుంబం గోదావరి నదిలోకి దూకింది. ఈ ఘటనలో భార్య పద్మినిని జాలర్లు రక్షించగా, శ్రీనివాస్ మరియు ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. పద్మినిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. పది రోజుల వ్యవధిలోనే అదే ప్రాంతంలో మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.