ఖమ్మంలో తీవ్ర విషాదం: బేతుపల్లి చెరువులో బోట్లు తిరగబడి పదిమంది గల్లంతు

రిపోర్టర్: విజయ్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుందని స్థానిక అధికారులు తెలిపారు. బేతుపల్లి చెరువులో ప్రమాదంలో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన పది మంది పోలీస్ కానిస్టేబుళ్లు ప్రయాణిస్తున్న రెండు ఎస్డీఆర్ఎఫ్ బోట్లు తిరగబడటంతో వారు నీటిలో గల్లంతయ్యారు. ఈ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు, రెస్క్యూ సిబ్బంది, గజ ఈతగాళ్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చెరువులో విస్తృతంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.