ఎన్నికల్లో హింసకు పాల్పడితే ఉక్కుపాదం: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరిక
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో హింసకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అభ్యర్థులకు, ఓటర్లకు పోలీసు శాఖ పూర్తిస్థాయి భద్రత కల్పిస్తుందని స్పష్టం చేశారు. నామినేషన్ల సమయంలో ఎనిమిది జిల్లాల్లో పద్నాలుగు హింస సంఘటనలు నమోదయ్యాయని, పదిహేడు మంది నిందితులను గుర్తించామని తెలిపారు.